దళితులంతా జగన్ కు అండగా ఉండాలి: వైయస్ అవినాశ్ రెడ్డి
- దళితుల పక్షపాతి జగన్
- ఆదినారాయణ రెడ్డి దళితులను అవహేళన చేస్తూ మాట్లాడారు
- ఇలాంటి నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలి
ముఖ్యమంత్రి జగన్ దళితుల పక్షపాతి అని... దళితుల అభ్యున్నతి కోసం ఎంతో తపిస్తున్నారని వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. దళిత విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని ఎన్నో పథకాలను తీసుకొచ్చారని చెప్పారు. జగన్ కు దళితులంతా అండగా ఉండాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? అని అవినాశ్ రెడ్డి ప్రశ్నించారు.
బీజేపీ నేత ఆది నారాయణరెడ్డి దళితులను అవహేళన చేస్తూ మాట్లాడారని మండిపడ్డారు. గతంలో వైసీపీ నుంచి గెలుపొందిన ఆదినారాయణరెడ్డి మంత్రి పదవి కోసం టీడీపీలో చేరారని విమర్శించారు. ఇలాంటి నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. ప్రతి రోజు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతున్నారని విమర్శించారు. విభజన చట్టంలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీని కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పారు. పోరుమామిళ్లలో జరిగిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.