యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తోన్న సీఎం కేసీఆర్
- కేసీఆర్‌తో పాటు పలువురు నేతలు
- ఆలయ పరిసరాలను పరిశీలించిన కేసీఆర్
- కేసీఆర్‌కు వేదపండితుల వేదాశీర్వచనాలు
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. యాదాద్రి పునర్నిర్మాణ పనులను ఆయన పరిశీలిస్తున్నారు. అంతకు ముందు కూడా హెలికాప్టర్ నుంచి ఆలయ పరిసరాలను కేసీఆర్ పరిశీలించారు.
యాదాద్రి పర్యటనలో కేసీఆర్ వెంట పలువురు మంత్రులు, నేతలు కూడా ఉన్నారు. వారందరికీ వేదపండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. బాలాలయంలో స్వామివారిని సీఎం, మంత్రులు దర్శించుకున్నారు.
యాదాద్రి పున:ప్రారంభం తేదీని ఇప్పటికే చినజీయర్ స్వామి నిర్ణయించారు. ఆ ముహూర్తాన్ని కేసీఆర్ స్వయంగా ప్రకటించనున్నారు. మహా సుదర్శన యాగం వివరాలపై కూడా ప్రకటన చేస్తారు.