దేశంలో కొత్తగా 13,058 కరోనా కేసులు
- నిన్న 164 మంది మృతి
- మొత్తం మృతుల సంఖ్య 4,52,454
- మొత్తం కేసుల సంఖ్య 3,40,94,373
- కేరళలో నిన్న 6,676 కేసులు
దేశంలో కొత్తగా 13,058 కరోనా కేసులు వెలుగుచూశాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్త కేసులు 231 రోజుల కనిష్ఠ స్థాయిలో నమోదయ్యాయని వివరించింది. నిన్న 19,470 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ఇక నిన్న కరోనాతో 164 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,52,454కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య 3,40,94,373కు పెరిగింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 227 రోజు కనిష్ఠానికి చేరింది. ప్రస్తుతం 1,83,118 మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు.
ఇప్పటివరకు మొత్తం 3,34,58,801 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం 98,67,69,411 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. కేరళలో నిన్న 6,676 కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో నిన్న 60 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.