హుజూరాబాద్ ఎన్నిక తర్వాతే దళిత బంధు అమలు... ఈసీ ఆదేశాలు
- టీఆర్ఎస్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న దళిత బంధు
- హుజూరాబాద్ లో అమలు
- ఈసీకి ఫిర్యాదులు
- ఓటర్లను ప్రభావితం చేస్తోందని నివేదన
తెలంగాణ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న దళిత బంధు పథకం అమలుకు బ్రేక్ పడింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యేవరకు దళిత బంధు అమలు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నిర్దేశించింది. ఎన్నికల వేళ హుజూరాబాద్ ఓటర్లను దళిత బంధు పథకం ప్రభావితం చేసేలా ఉందన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నుంచి మొదలుపెట్టాలని నిర్ణయించుకోవడం తెలిసిందే. తొలుత పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసి, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని భావించింది. ఇప్పటికే కొందరు లబ్దిదారులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరినట్టు తెలుస్తోంది.