రంగురంగుల ఊసరవెల్లి... కాలిఫోర్నియాలో దర్శనం

  • పచ్చరంగులో కనిపించే ఊసరవెల్లులు
  • కాలిఫోర్నియాలో పచ్చ, ఎరుపు రంగులో కనిపించిన జీవి
  • ఆశ్చర్యపోయిన స్థానికులు
  • ఇలాంటివి మడగాస్కర్ లో ఉంటాయన్న నిపుణులు
సాధారణంగా ఊసరవెల్లులు పచ్చ రంగులో కనిపిస్తుంటాయి. అవి చెట్లపై తిరుగుతూ అక్కడి పరిసరాలకు తగిన విధంగా లేత రంగులోకి, లేదా ముదురు రంగులోకి మారుతుంటాయి. అయితే, కాలిఫోర్నియాలో దర్శనమిచ్చిన ఓ ఊసరవెల్లి అనేక రంగులను కలిగి ఉండడం ఆశ్చర్యం కలిగింది.

ఒకే ఊసరవెల్లిలో అన్ని రంగులు కనిపించడం పట్ల స్థానికులు వింతగా తిలకించారు. తమ ప్రాంతంలో అలాంటి రంగురంగుల ఊసరవెల్లిని గతంలో ఎప్పుడూ చూడలేదని వారు తెలిపారు. స్థానికులు బ్రూస్ ఐర్లాండ్ అనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించడంతో ఆయన వచ్చి దాన్ని పట్టుకున్నారు.

ఈ కలర్ ఫుల్ ఊసరవెల్లికి చెందిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ తరహా ఊసరవెల్లులు మడగాస్కర్ లో మాత్రమే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని చిరుత వన్నెల ఊసరవెల్లులు అని పిలుస్తారని వివరించారు.


More Telugu News