టీ20 వరల్డ్ కప్: నెదర్లాండ్స్ పై 7 వికెట్ల తేడాతో ఐర్లాండ్ విక్టరీ

  • అబుదాబిలో ఐర్లాండ్ వర్సెస్ నెదర్లాండ్స్
  • మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్
  • నిప్పులు చెరిగిన ఐరిష్ బౌలర్లు కాంఫర్, అడైర్
  • 106 పరుగులకు నెదర్లాండ్స్ ఆలౌట్
  • 15.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన ఐర్లాండ్
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో ఐర్లాండ్ విజయంతో ప్రస్థానం ప్రారంభించింది. ఇవాళ నెదర్లాండ్స్ తో జరిగిన గ్రూప్ మ్యాచ్ లో ఐర్లాండ్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం అందుకుంది. 107 పరుగుల విజయలక్ష్యాన్ని 15.1 ఓవర్లలోనే ఛేదించింది. గారెత్ డెలానీ 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 44 పరుగులు చేయగా, ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో క్లాసెన్, గ్లోవర్, కెప్టెన్ సీలార్ తలో వికెట్ తీశారు.

అంతకుముందు నెదర్లాండ్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఐర్లాండ్ బౌలర్లు కర్టిస్ కాంఫర్, మార్క్ అడైర్ ధాటికి 20 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. ఏమంత కష్టసాధ్యం కాని లక్ష్యం కావడంతో ఐర్లాండ్ ఆటగాళ్లు పెద్దగా శ్రమ పడకుండానే ఛేదించారు. ఈ క్రమంలో కేవలం 3 వికెట్లు కోల్పోయారు.


More Telugu News