అప్పులు చేయకుండా ఎవరూ పాలించలేరు: డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- అప్పుల నేపథ్యంలో ఏపీ సర్కారుపై విపక్షాల విమర్శలు
- ఖండించిన నారాయణస్వామి
- కేంద్రం కూడా అప్పులు చేస్తోందని వ్యాఖ్య
- పేదల కోసమే తమ తాపత్రయమని స్పష్టీకరణ
ఏపీ సర్కారు మితిమీరి అప్పులు చేస్తోందంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మంత్రి నారాయణస్వామి స్పందించారు. అప్పులు చేయకుండా ఎవరూ పాలించలేరని సూత్రీకరించారు. అప్పు చేయడం తప్పేమీ కాదని అన్నారు. అప్పులు రాష్ట్రం ఒక్కటే చేయడం లేదని, కేంద్రం కూడా భారీగా అప్పులు చేస్తోందని చెప్పారు.
తమ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసమే అప్పులు చేస్తోందని వివరించారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసమే తమ తాపత్రయమని తెలిపారు. అప్పులు చేస్తున్నామంటూ వార్తలు రాసే పత్రికా యాజమాన్యాలు అప్పులు చేయడం లేదా? అని నారాయణస్వామి ప్రశ్నించారు.