కశ్మీర్లో వలస కూలీల ప్రాణాలకు కేంద్ర ప్రభుత్వం తగిన భద్రత కల్పించే చర్యలు తీసుకోవాలి: విజయసాయిరెడ్డి
- జమ్మూ కశ్మీర్ లో రెచ్చిపోతున్న ఉగ్రవాదులు
- 24 గంటల వ్యవధిలో 3 దాడులు జరిగాయన్న విజయసాయి
- మరో ఇద్దరు బీహారీలు మరణించారని వెల్లడి
జమ్మూ కశ్మీర్ లో వలస కూలీలే లక్ష్యంగా ఉగ్రవాదులు పేట్రేగిపోవడం హేయమైన, పిరికిపంద చర్య అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఉగ్రవాదులు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో మరో ఇద్దరు బీహార్ కూలీలు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. గడచిన 24 గంటల వ్యవధిలో ఇది మూడో ఉగ్రదాడి అని తెలిపారు.
గత రెండు, మూడ్రోజుల వ్యవధిలోనే 11 మంది సాధారణ పౌరులు మరణించారని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో నిరుపేద వలస కూలీల ప్రాణాలకు కేంద్ర ప్రభుత్వం తగిన భద్రత కల్పించే చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.