25 భాషల్లో లాంచ్ అయిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్!

  • వెబ్ సైట్ ద్వారా అందుబాటులోకి వచ్చిన ఆన్ లైన్ సేవలు
  • 'కె.చిరంజీవి' పేరుతో మరో వెబ్ సైట్ ఏర్పాటు
  • ఈ వెబ్ సైట్ ద్వారా అందుబాటులో చిరంజీవికి సంబంధించిన సమాచారం 
మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన 'చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్' ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి ఐ, బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మంది సేవలు పొందారు. కరోనా సమయంలో కూడా తన ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపించారు. తాజాగా ఈరోజు ట్రస్ట్ వెబ్ సైట్ ను ఆవిష్కరించారు. 25 భాషల్లో వెబ్ సైట్ ను ప్రారంభించారు. చిరంజీవి తనయుడు రాంచరణ్ ఈ వెబ్ సైట్ ను ఆవిష్కరించారు. ఈ వెబ్ సైట్ ద్వారా ట్రస్ట్ సేవలు ఆన్ లైన్లో కూడా అందుబాటులోకి వచ్చాయి.

మరిన్ని ప్రాంతాలకు బ్లడ్, ఐబ్యాంక్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం కోసమే ఈ వెబ్ సైట్ ను ప్రారంభించినట్టు ఈ సందర్భంగా రాంచరణ్ తెలిపారు. 25 భాషల్లో వెబ్ సైట్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవలను అందించడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ఇదే సందర్భంగా మరో వైబ్ సైట్ ని కూడా రాంచరణ్ ప్రారంభించారు. చిరంజీవి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, స్టార్ గా ఎదిగే క్రమంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలిసేలా 'కె.చిరంజీవి' పేరుతో వెబ్ సైట్ ను ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. చిరంజీవి జీవితం, ఆయన సినిమాలు, పాటలు, దర్శకనిర్మాతలతో ఆయనకున్న సత్సంబంధాలకు సంబంధించిన సమాచారం ఈ వెబ్ సైట్లో ఉంటుందని చెప్పారు.


More Telugu News