ఇండియా కరోనా అప్డేట్స్... గత 230 రోజుల్లో అతి తక్కువ కేసుల నమోదు!

  • గత 24 గంటల్లో 13,596 కేసుల నమోదు
  • దేశ వ్యాప్తంగా 166 మంది మృతి
  • యాక్టివ్ కేసుల సంఖ్య 1,89,694
భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఉద్ధృతంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ గొప్ప ఫలితాలను ఇస్తోంది. వ్యాక్సిన్ వల్ల వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతోంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,596 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 230 రోజుల్లో ఇది అతి తక్కువ సంఖ్య కావడం గమనార్హం.

ఇక నిన్న 166 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,89,694 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 3.40 కోట్ల మంది కరోనా బారిన పడగా... 3.34 కోట్ల మంది కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.12 శాతంగా ఉంది. ఇప్పటి వరకు మొత్తం 4,52,290 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందారు. పండుగల కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కాస్త నెమ్మదించింది. నిన్న కేవలం 12,05,162 మంది మాత్రమే టీకాలు వేయించుకున్నారు.


More Telugu News