తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
- ఉత్తర తెలంగాణపై అల్పపీడనం
- బంగాళాఖాతం నుంచి గాలులతో కూడిన ఉపరితల ద్రోణి
- రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ
తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే, బంగాళాఖాతం నుంచి గాలులతో ఉపరితల ద్రోణి ఈ ఆవర్తనం వరకు 1500 మీటర్ల వరకు ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతోనే అక్కడక్కడ వర్షాలు పడతాయని పేర్కొంది.