కేరళలో వర్షాలకు ఓ ఇల్లు నదిలోకి ఎలా జారిపోయిందో చూడండి!
- కేరళలో వాన విలయం
- పొంగిపొర్లుతున్న నదులు
- లక్షల మందిని తరలించిన అధికారులు
- వెంటాడుతున్న వరద ముంపు భయం
కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. నదులు ఉప్పొంగుతుండగా, కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరద ముంపు భయంతో లక్షల మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ క్రమంలో కేరళ వర్ష బీభత్సానికి నిదర్శనం వంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
కొట్టాయం జిల్లాలోని ముందకాయమ్ ప్రాంతంలో నది ఒడ్డున ఉన్న ఇల్లు బాగా నానిపోయి సుడులు తిరుగుతూ ప్రవహిస్తున్న నీటిలోకి జారిపోయింది. అయితే, ఆ ఇంట్లోని వ్యక్తులను అధికారులు ఖాళీ చేయించడంతో పెనుప్రమాదం తప్పింది. ఆ ఇల్లు పునాదులతో సహా పెకలించుకుని వచ్చిన వైనం వీడియోలో కనిపించింది.