విపక్షాలకు దిమ్మదిరిగేలా వరంగల్ ప్రజాగర్జన సభ: సీఎం కేసీఆర్
- ముగిసిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం
- సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం
- ఈసారి ముందస్తుకు వెళ్లేది లేదని వెల్లడి
- చేయాల్సినవి చాలా ఉన్నాయని వివరణ
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ మధ్యాహ్నం చేపట్టిన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లడంలేదని స్పష్టం చేశారు. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని తెలిపారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని, అన్ని పనులు చేసుకుందామని పేర్కొన్నారు. రోజుకు 20 నియోజకవర్గాలకు సన్నాహక సమావేశాలు నిర్వహించాలని పేర్కొన్నారు. విపక్షాలకు దిమ్మదిరిగే రీతిలో వరంగల్ ప్రజాగర్జన సభ ఉండాలని టీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేశారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికపై స్పందిస్తూ విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 26న గానీ, లేక 27న గానీ హుజూరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సభకు కేసీఆర్ హాజరుకానున్నారు. ఇక ఈ నెల 25న టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించనున్నారు. ఈ ప్లీనరీకి 6,500 మంది ప్రతినిధులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.