టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ తరఫున నామినేషన్ దాఖలు చేసిన మంత్రులు
- ఈ నెల 25న పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక
- ఈ నెల 22 వరకు నామినేషన్ల స్వీకరణ
- 23న నామినేషన్ పత్రాల పరిశీలన
- 24న ఉపసంహరణకు అవకాశం
ఈ నెల మూడో వారం నుంచి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికల ప్రక్రియ షురూ కానుంది. ఈ నెల 22 వరకు నామినేషన్ల స్వీకరణ, ఆ మరుసటి రోజు నామినేషన్ పత్రాల పరిశీలన, ఈ నెల 24న నామినేషన్ల ఉపసంహరణ, ఈ నెల 25న పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది.
ఈ నేపథ్యంలో కేసీఆర్ తరఫున తెలంగాణ మంత్రులు నేడు నామినేషన్ వేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ కుమార్, మల్లారెడ్డి, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కేసీఆర్ తరఫున నామినేషన్ పత్రాలు సమర్పించారు. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ పేరును ప్రతిపాదించారు.