ఈ వీడియో చివర్లో కనిపించింది ఎవరో గెస్ చేయగలరా?: మంచు విష్ణు

  • హైదరాబాదులో అలయ్ బలయ్
  • ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు
  • హాజరైన పవన్ కల్యాణ్, మంచు విష్ణు
  • విష్ణు ట్వీట్ పై నెటిజన్ల ఆగ్రహం!
హైదరాబాదులో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమం సందడిగా జరిగింది. ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరు కాగా, జనసేనాని పవన్ కల్యాణ్, మా అధ్యక్షుడు మంచు విష్ణు తదితరులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు సోషల్ మీడియాలో నెటిజన్లను ఓ ప్రశ్న అడిగారు. ఓ వీడియో పంచుకున్న విష్ణు... ఈ వీడియో చివర్లో ఉన్నది ఎవరో గెస్ చేయగలరా? అంటూ ట్వీట్ చేశారు.

ఆ వీడియోలో చివర పవన్ కల్యాణ్ అలయ్ బలయ్ వేదిక దిగువన మామూలు కుర్చీలో కూర్చుని ఉండడం చూడొచ్చు. కొన్ని ఫొటోల్లో పవన్ కల్యాణ్ వేదికపై ఎంతో ఠీవిగా ఉన్న కుర్చీలో కూర్చుని ఉండడం దర్శనమిచ్చింది. కాగా, మంచు విష్ణు చేసిన పోస్టుపై నెటిజన్ల స్పందన ఘాటైన రీతిలో ఉంది. దాదాపు ప్రతి రిప్లయ్ లోనూ మంచు కుటుంబాన్ని ఏకిపారేశారు.


More Telugu News