దాడిలో త‌మ ఇంజినీర్లు చ‌నిపోయినందుకు పాక్ నుంచి చైనా భారీగా ప‌రిహారం డిమాండ్‌

  • పాకిస్థాన్‌లోని డసు హైడ్రోపవర్ ప్రాజెక్టు సిబ్బందిపై దాడి
  • 13 మంది కొన్ని నెల‌ల క్రితం మృతి
  • వారిలో 9 మంది చైనా ఇంజినీర్లు
  • 38 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని చైనా డిమాండ్  
పాకిస్థాన్‌లోని డసు హైడ్రోపవర్ ప్రాజెక్టు సిబ్బందిలో 13 మంది కొన్ని నెల‌ల క్రితం  ఉగ్ర‌దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. వారిలో 9 మంది చైనా ఇంజినీర్లు కూడా ఉన్నారు. దీంతో త‌మ‌కు పాకిస్థాన్‌ 38 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని చైనా డిమాండ్ చేస్తోంది.

దీనిపై  పాకిస్థాన్ ప్ర‌భుత్వం ప‌లు వివ‌రాలు తెలిపింది. చైనాతో ఈ అంశంపై చ‌ర్చ‌లు జ‌రుపుతున్నామ‌ని వివ‌రించింది. దాడి జరిగినప్పటి నుంచి డసు ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని పాకిస్థాన్ అధికారి షహజేబ్ ఖాన్ బంగష్ తెలిపారు. తమ ఇంజినీర్లు మరణించినందుకు ముందుగా నష్టపరిహారం చెల్లించాలని, డసు ప్రాజెక్టు పనులను పునఃప్రారంభించడానికి ముందే పాక్ ఈ ప‌రిహారం ఇవ్వాల‌ని చైనా డిమాండ్ చేస్తోంది.

డసు ప్రాజెక్టును తిరిగి ప్రారంభించ‌డంతో పాటు న‌ష్ట‌ప‌రిహారం విష‌యంలో చైనా చేస్తోన్న‌ డిమాండ్‌పై
చర్చించేందుకు వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శుల స్టీరింగ్ కమిటీ ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన‌ట్లు సమాచారం. చైనా చేస్తోన్న డిమాండ్ ప‌ట్ల పాక్ సుముఖంగా లేదు. అంత‌గా న‌ష్ట‌ప‌రిహారం అడ‌గ‌డమేంట‌ని నిల‌దీస్తోంది. కాగా, డ‌సు ప్రాజెక్టు నిర్మాణం చైనా గెఝౌబా గ్రూప్ కార్పొరేషన్ ఆధ్వ‌ర్యంలో జ‌ర‌గాల్సి ఉంది.


More Telugu News