దసరా తిరుగు ప్రయాణాలు ఆరంభం.. హైదరాబాద్‌కు 150 బస్సులు రెడీ చేసిన ఏపీఎస్ ఆర్టీసీ
- రద్దీని బట్టి అవసరమైతే మరిన్ని బస్సులు
- రేపటి నుంచి అంతర్ జిల్లా బస్సులు అందుబాటులోకి
- ప్రత్యేక బస్సులకు ఆన్‌లైన్ రిజర్వేషన్ షురూ
దసరా సెలవులు ముగుస్తుండడంతో తిరుగు ప్రయాణాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రద్దీని తట్టుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న బస్సులకు అదనంగా హైదరాబాద్‌కు 150 సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చింది. నేడు ఆదివారం కావడంతో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని భావిస్తోంది. ప్రత్యేక బస్సులకు ఆన్‌లైన్ రిజర్వేషన్ సదుపాయాన్ని కూడా ప్రారంభించింది.
ఒకటి, రెండు జిల్లాల మధ్య ప్రయాణించేవారితో రేపు తెల్లవారుజాము నుంచి రద్దీ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో రేపు ఉదయం నుంచి అంతర్ జిల్లా సర్వీసులను కూడా అదనంగా నడపాలని నిర్ణయించారు. ప్రయాణికుల రద్దీని బట్టి అవసరమైన చోట్ల అదనపు బస్సులు నడుపుతామని ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.