జమ్మూకశ్మీర్ ఎన్ కౌంటర్లో మిస్ అయిన జవాన్ల కోసం భారీ సెర్చ్ ఆపరేషన్

  • సోమవారం నుంచి ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య కొనసాగుతున్న ఎదురుకాల్పులు
  • ఇప్పటి వరకు ఏడుగురు జవాన్ల మృతి
  • ఎన్ కౌంటర్ లో ఇంతవరకు ఒక్క ఉగ్రవాది కూడా చనిపోలేదు
జమ్మూకశ్మీర్ లో ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ తో పాటు ఒక జవాన్ ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. వారి కోసం సైనికులు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. సోమవారం నుంచి పూంచ్-రాజౌరి అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు, సైనికుల మధ్య భారీ స్థాయిలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.

ఈ కాల్పుల్లో ఇప్పటికే ఇద్దరు సైనికులు మరణించారు. నాలుగు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లో ఐదుగురు జవాన్లు మరణించారు. దీంతో చనిపోయిన జవాన్ల సంఖ్య ఏడుకు చేరింది. ఈ స్థాయిలో జవాన్లను కోల్పోవడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న ఎన్ కౌంటర్ లో ఒక్క ఉగ్రవాది కూడా చనిపోకపోవడం గమనార్హం.


More Telugu News