మావోయిస్టు అగ్రనేత ఆర్కే అంత్యక్రియలు అడవుల్లో పూర్తి
- అనారోగ్యంతో ఆర్కే మృతి
- ధ్రువీకరించిన మావోయిస్టు పార్టీ
- పామేడు-కొండపల్లి అటవీప్రాంతంలో నిన్న అంత్యక్రియలు
- ఫొటోలు విడుదల చేసిన మావోలు
మావోయిస్టు అగ్రనేత ఆర్కే అనారోగ్యంతో మృతి చెందడం తెలిసిందే. ఆర్కే మృతి విషయాన్ని పోలీసులు ఇటీవల వెల్లడించగా, అనంతరం ఆయన మరణాన్ని మావోయిస్టు పార్టీ నిర్ధారించింది. కాగా, ఆర్కే అంత్యక్రియల తాలూకు ఫొటోలను మావోయిస్టులు విడుదల చేశారు. ఆర్కే అంత్యక్రియలను మావోయిస్టులు అడవుల్లో పూర్తి చేశారు. ఆర్కే భౌతికకాయంపై ఎర్రజెండా ఉంచిన మావోలు నివాళులు అర్పించారు.
తెలంగాణ సరిహద్దులోని పామేడు-కొండపల్లి ప్రాంతంలో ఆర్కే అంత్యక్రియలు మావోయిస్టు లాంఛనాలతో నిన్న మధ్యాహ్నం 2 గంటలకు జరిగినట్టు తెలుస్తోంది. తమ సహచరుడికి తుదివీడ్కోలు పలికేందుకు భారీగా మావోయిస్టులు తరలివచ్చారు. స్థానిక గిరిజనులు కూడా ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నట్టు ఫొటోల్లో కనిపిస్తోంది.