గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో కిడ్నాపైన శిశువు క్షేమం
- జీజీహెచ్ లో నాలుగు రోజుల శిశువు అపహరణ
- మరో మహిళతో కలిసి వార్డ్ బాయ్ దుశ్చర్య
- సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా నిందితుల గుర్తింపు
- శిశువును తల్లిదండ్రులకు అప్పగింత
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అపహరణ వ్యవహారం సుఖాంతమైంది. గత అర్థరాత్రి దాటిన తర్వాత శిశువు అపహరణకు గురికాగా, పోలీసులు తీవ్రంగా శ్రమించి కేసును ఛేదించారు. జీజీహెచ్ వార్డ్ బాయ్, ఓ మహిళ కలిసి ఈ కిడ్నాప్ కు పాల్పడినట్టు గుర్తించారు. వారిని గుంటూరు నెహ్రూ నగర్ ఒకటో లైనులోని ఓ ఇంటిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుల ఆచూకీ లభ్యమైంది. శిశువును స్వాధీనం చేసుకున్న పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.