గ‌బ్బిలాల‌ను దేవ‌త‌ల్లా పూజిస్తోన్న గ్రామ‌స్థులు.. వాటివ‌ల్లే త‌మ గ్రామంలోకి క‌రోనా రాలేద‌ని న‌మ్మ‌కం

  • నెల్లూరు జిల్లాలోని పనసరెడ్డి పల్లి గ్రామంలో ఘ‌ట‌న‌
  • త‌మ గ్రామంలో గబ్బిలాలు ఉండడం అదృష్ట‌మంటోన్న గ్రామ‌స్థులు
  • గ‌బ్బిలాల‌ను ఎవ‌రైనా రాళ్ల‌తో కొట్టాల‌ని చూస్తే అడ్డుకుంటోన్న వైనం
క‌రోనా మ‌హ‌మ్మారి గబ్బిలాల నుంచే మ‌నుషుల‌కు సోకింద‌ని అప్ప‌ట్లో వాద‌న‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అంతేగాక‌, గ‌బ్బిలాలు ఇంటి వ‌ద్ద క‌న‌ప‌డితే అరిష్టం అని భార‌తీయులు చాలా మంది భావిస్తారు. అయితే, నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలం పనసరెడ్డి పల్లి గ్రామంలో మాత్రం గబ్బిలాలను అదృష్టంగా భావిస్తున్నారు. అవే త‌మ పాలిట దేవతలని అంటున్నారు.

గబ్బిలాలే తమ‌ను క‌రోనా నుంచి ర‌క్షించాయ‌ని చెబుతున్నారు. త‌మ గ్రామంలో గబ్బిలాలు ఉండడం వల్లే గ్రామంలోకి కరోనా  రాలేదని అంటున్నారు. ఆ గబ్బిలాలు పగటిపూట మాత్రమే గ్రామంలో కనప‌డుతున్నాయి. అవి దేవ‌తా గ‌బ్బిలాలంటూ గ్రామ‌స్థులు న‌మ్ముతున్నారు. ఆ గ్రామంలోకి కొత్త‌గా వ‌స్తోన్న వారు అక్క‌డున్న‌ గ‌బ్బిలాలు, వాటిని దేవ‌త‌ల్లా కొలుస్తోన్న ప్ర‌జ‌ల‌ను చూసి ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. అవి త‌మ గ్రామంలో ఉండ‌డం త‌మ అదృష్ట‌మ‌ని గ్రామస్థులు గొప్పగా చెప్పుకుంటున్నారు.


More Telugu News