మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. హైదరాబాద్‌లో రూ. 109 దాటిన లీటరు పెట్రోలు ధర

  • సెంచరీ దాటేసిన డీజిల్
  • ముంబైలో రికార్డు స్థాయిలో లీటరు పెట్రోలు ధర రూ. 110.75
  • వరుసగా మూడో రోజూ పెరిగిన ధరలు
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో ఆ ప్రభావం దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలపైనా పడింది. దేశంలో వరుసగా మూడో రోజూ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోలుపై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు చొప్పున పెరిగాయి. ఫలితంగా లీటరు పెట్రోలు ధర రూ. 109.73కు చేరుకోగా, డీజిల్ ధర రూ. 102.80కి పెరిగింది.

గత మూడు వారాల్లో డీజిల్ ధరలు 18 సార్లు పెరగ్గా, పెట్రోలు ధర రూ. 15 సార్లు పెరగడం గమనార్హం. దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలుపై 35 పైసలు పెరగడంతో రూ. 104.79కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 93.52కు పెరిగింది. ముంబైలో లీటరు పెట్రోలుపై 37 పైసలు పెరగడంతో రికార్డు స్థాయిలో రూ. 110 దాటేసి రూ. 110.75కు చేరుకుంది.

ఇక డీజిల్ ధర కూడా సెంచరీ దాటేసి రూ. 101.40కు పెరిగింది. చెన్నైలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ. 102.10, రూ. 97.93, కోల్‌కతాలో రూ. 105.44, రూ. 96.63గా ఉంది. కాగా, అంతకుముందు వరుసగా మంగళవారం, బుధవారం పెట్రో ధరలను సవరించకపోవడంతో ఊపిరిపీల్చుకున్న వినియోగదారులు ఆ తర్వాత వరుసగా మూడు రోజులు పెరిగే సరికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.


More Telugu News