ఒక్క ఆర్కే చనిపోయినంత మాత్రాన ఉద్యమం ఆగిపోదు: హరగోపాల్
- ఆర్కే మృతి బాధాకరం
- రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో కీలకపాత్ర పోషించారు
- చిన్న వయసులోనే కమ్యూనిస్ట్ భావాలు, సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు
మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) అనారోగ్య కారణాలతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణంపై ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి బాధాకరమని చెప్పారు. 2004లో రాష్ట్ర ప్రభుత్వానికి, మావోయిస్టులకు జరిగిన చర్చల్లో రామకృష్ణ కీలకపాత్ర పోషించారని అన్నారు.
మావోల డిమాండ్ లను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి, వాటిని ప్రభుత్వం పరిష్కరించేలా కృషి చేశారని కొనియాడారు. కమ్యూనిస్ట్ భావాలు, సిద్ధాంతాల పట్ల ఆర్కే చిన్న వయసులోనే ఆకర్షితులయ్యారని చెప్పారు. శాంతి చర్చల దిశగా అడుగులు వేయాలని ఆర్కేని తాము కలిసి ఒప్పించామని తెలిపారు. తాను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఆర్కే పరితపించారని చెప్పారు. ఒక్క ఆర్కే చనిపోయినంత మాత్రాన ఉద్యమం ఆగిపోదని... మరెందరో ఆర్కేలు పుట్టుకొస్తారని అన్నారు.