శరవేగంగా అయోధ్య రామాలయ నిర్మాణం.. భక్తులకు దర్శనం ఎప్పటి నుంచి అంటే..!

  • 2.77 ఎకరాల విస్తీర్ణంలో రామమందిరం
  • 161 అడుగుల ఎత్తులో భవ్యమందిర నిర్మాణం
  • డిసెంబర్ 2023 నాటికి భక్తులకు స్వామివారి దర్శనం
శ్రీరాముడి జన్మభూమి అయోధ్యలో రామమందిర నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. 2.77 ఎకరాల విస్తీర్ణంలో మూడు అంతస్తుల్లో, 161 అడుగుల ఎత్తులో భవ్య మందిరాన్ని నిర్మిస్తున్నారు. రామ మందిరం భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్న సంగతి తెలిసిందే. మరోవైపు, ఫౌండేషన్ నిర్మాణం ఫస్ట్ ఫేజ్ పనులు ముగిశాయి. నవంబర్ మధ్య నాటికి సెకండ్ ఫేజ్ పనులు పూర్తి కానున్నాయి. 2023 నాటికి ఆలయ నిర్మాణం పూర్తి అవుతుంది. డిసెంబర్ 2023 నాటికి భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కలగబోతోంది. ఈ వివరాలను శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర తెలియజేసింది.


More Telugu News