రైతులు ఆందోళన చేస్తోన్న ప్రాంతంలో.. ఓ మృత‌దేహాన్ని బారికేడ్‌కు వేలాడ‌దీసిన వైనం

  • ఢిల్లీ స‌మీపంలోని సింఘు సరిహద్దు వద్ద ఘ‌ట‌న‌
  • రైతుల నిరసన చేపట్టే వేదికకు సమీపంలోనే 35 ఏళ్ల‌ వ్యక్తి హ‌త్య‌
  • అత‌డి మణికట్టును కోసేసి మ‌రీ చంపిన దుండ‌గులు
కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌ఖింపూర్ ఖేరీలో చోటు చేసుకున్న హింస ఘ‌ట‌న మ‌ర‌వ‌క‌ముందే ఢిల్లీ స‌మీపంలోని సింఘు సరిహద్దు వద్ద ఓ ఘోరం వెలుగులోకి రావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.  రైతులు నిరసన చేపట్టే వేదికకు సమీపంలో 35 ఏళ్ల‌ ఓ వ్యక్తిని ఎవ‌రో దారుణ హత్య చేసి బారికేడ్‌కు వేలాడ‌దీశారు.

అత‌డి మణికట్టును కోసేసి మ‌రీ దారుణంగా హత్య చేయ‌డం గ‌మ‌నార్హం. ఆ వ్య‌క్తి ఎవ‌ర‌న్న విష‌యంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వ్య‌క్తి దారుణ హ‌త్య ఘ‌ట‌న‌పై సంయుక్త కిసాన్ మోర్చా స్పందించింది. పంజాబ్‌, హర్యానాలోని ప్రధాన వర్గంలోని తిరుగుబాటుదారులైన నిహంగాలే ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డార‌ని తెలిపింది. కాగా, ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను ఉపసంహ‌రించుకునే వ‌ర‌కు తాము ఆందోళ‌న కొన‌సాగిస్తూనే ఉంటామ‌ని రైతులు చెబుతున్నారు.


More Telugu News