అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. చక్రస్నానం కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ

  • ఉత్సవాల్లో ఆఖరి ఘట్టంగా చక్రస్నానం
  • సీజేఐ ఎన్వీ రమణ సహా పాల్గొన్న సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు
  • చక్రస్నానం అనంతరం స్వామికి, ఉభయ దేవేరులకు స్వపన తిరుమంజనం
తిరుమల కొండపై శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో ఈసారి కూడా ఉత్సవాలు ఏకాంతంగానే జరుగుతున్నాయి. ఇక, ఉత్సవాల్లో ఆఖరి ఘట్టమైన శ్రీవారి చక్రస్నానం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

చక్రస్నానం అనంతరం స్వామికి, ఉభయదేవేరులకు, చక్రాత్తాళ్వార్లకు స్వపన తిరుమంజనం నిర్వహిస్తారు. పంచామృతాలతో అభిషేక కైంకర్యం నిర్వహిస్తారు. స్వామి ప్రతినిధిగా చక్రత్తాళ్వారుడికి స్నానం చేయిస్తారు. అలాగే, స్వామి చివరి రూపమైన అర్చా విగ్రహానికి చక్రస్నానం నిర్వహించిన అనంతరం ఆనంద నిలయానికి తరలిస్తారు.


More Telugu News