విజయవాడ మార్గంలో 4 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
- సొంతూళ్లకు వెళ్తున్న వారితో కిక్కిరిసిన రహదారి
- నాలుగు కిలోమీటర్ల దూరాన్ని దాటేందుకు గంటకుపైగా సమయం
- తీవ్ర ఇక్కట్లు పడుతున్న వాహనదారులు
దసరా పండుగ కోసం సొంతూళ్లకు వెళ్తున్న వారి వాహనాలతో హైదరాబాద్-విజయవాడ హైవే కిక్కిరిసిపోయింది. నిన్న సాయంత్రం ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా చౌటుప్పల్ నుంచి కొయ్యలగూడెం వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చిక్కుకుపోయిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సాధారణ సమయాల్లో ఈ దూరాన్ని దాటేందుకు నాలుగు నిమిషాల సమయం పడుతుంది. అలాంటిది నిన్న దాదాపు గంట సమయం పట్టింది. దీంతో వాహనాల్లోని చిన్నారులు, పెద్దలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు.