టీవీలో చూస్తేనే తెలిసింది.. ఆర్కే మృతిపై తోడల్లుడు కల్యాణ్‌రావు
- ఆర్కేకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు
- మూడు నెలల క్రితమే ఆర్కేను రహస్యంగా కలిసిన భార్య
- తల్లిదండ్రులంటే ఆర్కేకు ఎంతో ఇష్టం
- ప్రభుత్వాలు అనుమతిస్తే అంత్యక్రియలు నిర్వహిస్తాం: సోదరుడు రాధేశ్యాం
మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్కే మృతి విషయమై ఆ పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదని, టీవీల్లో చూసి తెలుసుకున్నామని ఆయన తోడల్లుడు, విరసం నేత జి.కల్యాణ్‌రావు తెలిపారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఆర్కేకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవన్నారు.
కాగా, ఆర్కే భార్య శిరీష మూడు నెలల క్రితం ఆయనను కలిసినట్టు సమాచారం. తల్లిదండ్రులు, సోదరులంటే ఆర్కేకు ఎంతో ఇష్టం. ఉద్యమం కోసం అడవులకు వెళ్లినా, వారిని చూసేందుకు రహస్యంగా మూడుసార్లు హైదరాబాద్ వచ్చినట్టు ఆయన సోదరుడు రాధేశ్యాం తెలిపారు. ప్రభుత్వాలు అవకాశమిస్తే ఆర్కే మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కాగా, ఆర్కే మృతిపై తమకు ఇప్పటి వరకు కచ్చితమైన సమాచారం ఏదీ లేదని ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు.