టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు

  • వికెట్లు తీసే సామర్థ్యం అతడికి లేదు
  • పొట్టి ఫార్మాట్‌కు అతడు పనికిరాడు
  • ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టుకు అతడు భారమే తప్ప మరోటి కాదు
  • నేనైతే అతడికి జట్టులో స్థానమే ఇవ్వను
ఐపీఎల్‌లో ఢిల్లీ కేపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బౌలింగులో ఎన్నో ఘనమైన రికార్డులు అందుకున్న అశ్విన్ అసలు టీ20 ఫార్మాట్‌కు పనికిరాడని, అతడికి వికెట్లు తీసుకునే సామర్థ్యమే లేదని విమర్శించాడు. ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టుకు అతడు భారమే తప్ప మరోటి కాదని అన్నాడు. తానైతే అతడిని జట్టులోకి తీసుకోబోనని స్పష్టం చేశాడు. అశ్విన్ ఏ జట్టుకీ కీలక బౌలర్ కాదని పేర్కొన్న మంజ్రేకర్.. అతడి గురించి మాట్లాడి ఇప్పటికే చాలా సమయాన్ని వృథా చేశామని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

టెస్టుల్లో అద్భుతమైన బౌలర్ అయిన అశ్విన్ ఇంగ్లండ్ సిరీస్‌లో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడకపోవడం విడ్డూరంగా ఉందని అన్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2  మ్యాచ్‌ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగింది. చివరి ఓవర్‌లో ఏడు పరుగులు అవసరం. అశ్విన్ బంతి అందుకున్నాడు. తొలి రెండు బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చి మూడో బంతికి షకీబ్‌ను వెనక్కి పంపాడు. నాలుగో బంతికి అక్షర్ దొరికిపోయాడు. అయితే, ఐదో బంతిని త్రిపాఠి స్టాండ్స్‌లోకి పంపి కోల్‌కతాకు తిరుగులేని విజయాన్ని అందించాడు.


More Telugu News