బీజేపీ, కాంగ్రెస్ లు ఏపీకి తీరని ద్రోహం చేశాయి: మంత్రి పెద్దిరెడ్డి
- కాంగ్రెస్ చేసిన పాపం దేశంలోనే అడ్రస్ కోల్పోయేలా చేసింది
- బీజేపీకి ఏపీ ప్రజలు ఓటు వేయరు
- కరోనా పరిస్థితుల్లో కూడా జగన్ అద్భుతమైన పాలన అందిస్తున్నారు
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలు రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాయని మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన పాపం వారిని రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అడ్రస్ కోల్పోయేలా చేసిందని అన్నారు. ఈరోజు ఆయన ఎంపీ అవినాశ్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి దాసరి సుధలతో కలిసి బద్వేల్ ఉపఎన్నిక ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
బీజేపీ గురించి ఏపీ ప్రజలకు సరిగా తెలియదని... ఆ పార్టీకి ఎవరూ ఓటు వేయరని పెద్దిరెడ్డి అన్నారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థల ద్వారా పాలనను ప్రజలకు చేరువ చేశామని చెప్పారు. అర్హతే కొలబద్దగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. కరోనా వల్ల తలెత్తిన పరిస్థితులను ఎదుర్కొంటూనే రాష్ట్రంలో సంక్షేమం కుంటుపడకుండా జగన్ పాలన అందిస్తున్నారని కొనియాడారు.
బద్వేల్ నియోజకవర్గంలో తాగు, సాగునీటి కోసం తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను గత ప్రభుత్వాలు చేయలేదని విమర్శించారు. ఈ సందర్భంగా వైయస్ అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ, సంక్షేమం, అభివృద్ధిని అన్ని కుటుంబాలకు తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వ పాలన గురించి ప్రతి ఒక్క ఓటరుకి వివరించాలని వైసీపీ శ్రేణులకు సూచించారు.