సీఎం కాగానే ఆ హామీలన్నీ గాలికొదిలేశారు... జగన్ కు నారా లోకేశ్ బహిరంగ లేఖ
- ఆప్కాస్ ఉద్యోగుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోండి
- 20 నెలల జీతాల బకాయిలను తక్షణమే చెల్లించాలి
- మీరిచ్చిన హామీలను మీకే గుర్తు చేయాల్సి రావడం దురదృష్టకరం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ నేత నారా లోకేశ్ బహిరంగ లేఖ రాశారు. విధుల నుంచి తొలగించిన ఆప్కాస్ ఉద్యోగుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, 20 నెలల జీతాల బకాయిలను తక్షణమే చెల్లించాలంటూ లేఖలో ఆయన డిమాండ్ చేశారు. మీరిచ్చిన హామీలను గుర్తు చేస్తూ మీకు లేఖలు రాయాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు.
'పాదయాత్ర చేస్తూ... కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నేనున్నాను.. నేను మీ గోడు విన్నానన్నారు. మీ మాటలు నమ్మి ఓట్లేసిన ఆ ఉద్యోగులంతా మీరు ముఖ్యమంత్రి కాగానే... వాళ్లకిచ్చిన హామీలన్నీ నెరవేర్చుతారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నాడు ఊరూరా సభల్లో మారుమోగేలా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ప్రతి నెలా ఠంచనుగా ఒకటో తేదీకి జీతం వచ్చేలా చేస్తానని, ఏజెన్సీల వంటి దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం నుంచే నిర్వహిస్తామని హామీలిచ్చారు. సీఎం కాగానే హామీలన్నీ గాలికొదిలేశారు' అని లోకేశ్ విమర్శించారు.