ఏపీలో 100 శాతం సీటింగ్ తో సినిమా ప్రదర్శనలకు అనుమతి... సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన మైత్రీ మూవీ మేకర్స్

ఏపీలో 100 శాతం సీటింగ్ తో సినిమా ప్రదర్శనలకు అనుమతి... సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన మైత్రీ మూవీ మేకర్స్
  • ఏపీలో కరోనా మార్గదర్శకాల విడుదల
  • సినిమా ప్రదర్శనలపై ఆంక్షల తొలగింపు
  • దసరాకు పెద్ద సినిమాల విడుదల
  • సినీ రంగానికి ఊరట
ఏపీలో కరోనా మార్గదర్శకాలు సవరించిన నేపథ్యంలో, సినిమా హాళ్లలో 100 శాతం సీటింగ్ తో ప్రదర్శనలకు అనుమతి ఇచ్చారు. అలాగే, రోజుకు 4 ప్రదర్శనలపై ఆంక్షలు ఎత్తివేశారు. సీట్ల మధ్య ఖాళీలు వదలాలన్న నిబంధనను తొలగించారు.

ఈ నేపథ్యంలో, టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది. ఏపీ సీఎం జగన్ కు, మంత్రి పేర్ని నానిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంది. సినిమా హాళ్లలో 100 శాతం సీటింగ్ తో ప్రదర్శనలు, 4 షోస్ కు అనుమతించడం ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమ పునర్నిర్మాణం దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారని కొనియాడింది. ఈ దసరాకు పలు పెద్ద సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సినిమా రంగానికి పెద్ద ఊరట అని చెప్పాలి.


More Telugu News