బీజేపీని అడ్డుకునేందుకు అన్ని పార్టీలు కలసి రావాలి: యూపీ ఎన్నికల నేపథ్యంలో శరద్ పవార్

  • బీజేపీయేతర పార్టీలన్నీ ఏకం కావాలి
  • ఓట్లు చీలకుండా ఉండటం చాలా కీలకం
  • విడివిడిగా పోటీ చేస్తే అది బీజేపీకి లాభం 
వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసేందుకు అన్ని పార్టీలు వ్యూహాలను రచించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓట్లు చీలకుండా ఉండేందుకు బీజేపీయేతర పార్టీలన్నీ ఏకం కావాలని ఆయన సూచించారు. బీజేపీని అడ్డుకునేందుకు అన్ని పార్టీలు కలసి రావాలని చెప్పారు.

ఎన్నికల్లో ఓట్లు సాధ్యమైనంతగా చీలకుండా చూడటం చాలా కీలకమని శరద్ పవార్ అన్నారు. బీజేపీయేతర పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే అది బీజేపీకి లాభిస్తుందని చెప్పారు. లఖీంపూర్ ఖేరి ఘటనపై ఆయన స్పందిస్తూ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చట్టం నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదని అన్నారు. సీబీఐ, ఎన్సీబీ, ఈడీ వంటి కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తూ కేంద్ర ప్రభుత్వం విపక్షాలను టార్గెట్ చేస్తోందని మండిపడ్డారు.


More Telugu News