నామినేషన్ల ఉపసంహరణ తర్వాత బద్వేలు ఉప ఎన్నిక బరిలో 15 మంది అభ్యర్థులు
- ఈ నెల 30న బద్వేలు ఉప ఎన్నిక
- నేడు నామినేషన్ల ఉపసంహరణ
- నామినేషన్లు వెనక్కి తీసుకున్న ముగ్గురు అభ్యర్థులు
- అభ్యర్థులను బరిలో దింపని టీడీపీ, జనసేన
బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 30న జరగనుంది. కాగా, నేడు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బద్వేలు బరిలో 15 మంది అభ్యర్థులు మిగిలారు. బద్వేలు బరిలో మొత్తం 27 మంది నామినేషన్ వేశారు. నామినేషన్ల పరిశీలన సందర్భంగా 9 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.
ఇక 18 మంది మిగలగా, వారిలో ముగ్గురు నేడు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దాంతో బద్వేలు బరిలో 15 మంది మిగిలినట్టయింది. కాగా, ప్రధానంగా వైసీపీ తరఫున డాక్టర్ దాసరి పద్మ, బీజేపీ తరఫున పనతల సురేశ్ పోటీ చేస్తున్నారు. టీడీపీ, జనసేన తమ అభ్యర్థులను బరిలో దించరాదని నిర్ణయించడం తెలిసిందే.