తన కుమార్తె పేరు ఏంటో చెప్పిన హీరోయిన్ శ్రియ!
- ఏడాది క్రితం పాపకు జన్మనిచ్చిన శ్రియ
- రాధ అన్న పేరు పెట్టినట్లు చెప్పిన హీరోయిన్
- భగవంతుడికి థ్యాంక్స్ చెబుతున్నట్లు పోస్ట్
హీరోయిన్ శ్రియకు పండంటి పాప పుట్టింది. అయితే, ఆ పాప పుట్టిన దాదాపు ఏడాది తర్వాత శ్రియ ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. ఆ పాప పేరు రాధ అని శ్రియ చెప్పింది. గత ఏడాది ప్రపంచం మొత్తం కరోనా వైరస్ ప్రభావంతో గందరగోళ పరిస్థితుల్లో వున్న సమయంలో తమ ప్రపంచమే మారిపోయిందని శ్రియ తెలిపింది.
ఆ సమయం అంతా అడ్వెంచర్, లెర్నింగ్‌తో తమ ప్రపంచం నిండిపోయిందని, తమ జీవితాల్లోకి ఓ ఏంజిల్ వచ్చిందని చెప్పింది. భగవంతుడికి ధన్యవాదాలు చెబుతున్నట్లు ఇన్ స్టాలో పేర్కొంది. తన భర్త, కుమార్తెతో ఫొటోలను ఆమె పోస్ట్ చేసింది. కాగా, వ్యాపారవేత్త ఆండ్రూ కొశ్చివ్‌తో శ్రియకు 2018లో వివాహం జరిగింది. ప్రస్తుతం శ్రియ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నటిస్తోంది.