ఉండవల్లి వ్యాఖ్యల వీడియో పార్ట్-2 పంచుకున్న పవన్ కల్యాణ్

  • ఏపీ ప్రభుత్వ ఆర్థిక స్థితిపై ఉండవల్లి విశ్లేషణ
  • ఈ ఉదయం ఒక వీడియో పంచుకున్న పవన్
  • దానికి కొనసాగింపుగా తాజా వీడియో
  • గణాంకాలను వెల్లడించిన ఉండవల్లి
ఏపీ ప్రభుత్వం నేటికి ఆరు లక్షల కోట్ల అప్పుతో ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషించడం తెలిసిందే. ఉండవల్లి వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియోను ఈ ఉదయం పంచుకున్న జనసేనాని పవన్ కల్యాణ్... తాజాగా ఉండవల్లి చేసిన మరికొన్ని వ్యాఖ్యలతో పార్ట్-2 వీడియో క్లిప్పింగ్ ను పంచుకున్నారు. ఇందులోనూ ఉండవల్లి ఏపీ ప్రభుత్వం ఎంత అప్పు తెచ్చిందన్నది వివరించడం చూడొచ్చు.

కార్పొరేషన్లను తనఖా పెట్టడం ద్వారా తెచ్చిన అప్పు రూ.1,21,203 కోట్లు అని ఉండవల్లి పేర్కొన్నారు. ఇందులో రూ.71,761 కోట్లను ఈ రెండేళ్లలోనే తెచ్చారని తెలిపారు. అంతేకాదు, కేంద్రం వద్దకు వెళ్లి ఏంచేశారో తెలియదు కానీ, మిగతా రాష్ట్రాల కంటే ఓ రూ.20 వేల కోట్ల అప్పు అదనంగా తీసుకువచ్చారని వివరించారు.

సాధారణ పరిస్థితుల్లో ఎఫ్ఆర్ బీఎం పరిమితి 3 శాతం ఉంటుందని, కరోనా సంక్షోభం వల్ల ఆ పరిమితిని 5 శాతం పెంచారని ఉండవల్లి వెల్లడించారు. ఎఫ్ఆర్ బీఎం మీద తెచ్చిన అప్పు రూ.3,50,000 కోట్లు అని తెలిపారు. జగన్ పరిపాలన చేపట్టే నాటికి రాష్ట్రానికి ఇంకో రూ.90 వేల కోట్ల అప్పు ఉందని అన్నారు. ఈ విధంగా రాష్ట్రంపై రూ. 6 లక్షల కోట్ల వరకు అప్పు ఉందని విశదీకరించారు.


More Telugu News