ఇది స్కూటరే... ధర మామూలుగా లేదు!

  • భారత్ లో మ్యాక్సీ స్కూటర్ తీసుకువచ్చిన  బీఎండబ్ల్యూ
  • ప్రారంభ ధర రూ.9.95 లక్షలు
  • బ్లాక్ షేడ్ ధర రూ.10.15 లక్షలు
  • అనేక ఆకర్షణీయ ఫీచర్లతో బీఎండబ్ల్యూ సి-400 జీటీ
అంతర్జాతీయ ఆటో మొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ తాజాగా భారత మార్కెట్లోకి సి-400 జీటీ మ్యాక్సీ స్కూటర్ ను తీసుకువచ్చింది. వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుని భారత్ లో విక్రయిస్తారు. నేటి నుంచే బుకింగులు షురూ అయ్యాయి. కంఫర్ట్, డైనమిక్ పెర్ఫార్మెన్స్, లాంగ్ డ్రైవ్ లకు అనుగుణమైన నిర్మాణం దీని ప్రత్యేకత.

అవడానికి ఇది స్కూటర్ అయినా, దీని ధర మాత్రం మామూలుగా లేదు. ఎక్స్ షోరూమ్ ధర రూ.9.95 లక్షలు అని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంట్లోనే స్టైల్ ట్రిపుల్ బ్లాక్ మోడల్ ఖరీదు రూ.10.15 లక్షలు అని వెల్లడించాయి.

దీంట్లో సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ వాటర్ కూల్డ్ ఇంజిన్ అమర్చారు. 7,500 ఆర్పీఎం వద్ద 33.5 బీహెచ్ పీ శక్తిని విడుదల చేస్తుంది. 9.5 సెకన్లలోనే 0 నుంచి 100 కిమీ వేగం అందుకుంటుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 139 కిలోమీటర్లు. డిజిటల్ కన్సోల్, ట్విన్ ఎల్ఈడీ హెడ్ లైట్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్, హై విండ్ షీల్డ్, టీఎఫ్ టీ స్క్రీన్ సహిత ఫంక్షన్ క్లస్టర్ ఈ మ్యాక్సీ సూటర్ లో ఆకర్షణీయమైన ఫీచర్లు.


More Telugu News