హైదరాబాదులో పవన్ కల్యాణ్ ను కలిసిన బీసీ సంఘాల నేతలు
- ఈ నెల 23న హైదరాబాదులో సెమినార్
- పవన్ ను ఆహ్వానించిన నేతలు
- బీసీ ఉద్యమం పట్ల పవన్ సంఘీభావం
- ప్రతి వేదికపైనా మాట్లాడతానని హామీ
జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు ఇవాళ హైదరాబాదులో జనసేనాని పవన్ కల్యాణ్ ను కలిశారు. ఈ నెల 23న హైదరాబాదులో బీసీ సంక్షేమ సంఘం నిర్వహించే జాతీయస్థాయి సెమినార్ కు వారు పవన్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ స్పందిస్తూ, బీసీ సంఘాలు చేస్తున్న ఉద్యమం తాలూకు భావజాల వ్యాప్తికి తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అధికారానికి దూరంగా ఉన్న కులాల కోసం పనిచేయాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నామని వెల్లడించారు.
ఏళ్ల తరబడి ఉద్యమాలు చేస్తున్నా, అసలు సమయం వచ్చేసరికి ఆచరణకు నోచుకోవడంలేదని విచారం వ్యక్తం చేశారు. బీసీల హక్కుల కోసం ఉద్యమించే సమయంలో అందరూ ఏకమవుతున్నా, ఎన్నికలు వచ్చేసరికి ఎవరికి వారు విడిపోతున్నారని వివరించారు.
అందుకు రాజకీయపరమైన అవగాహన అవసరం అని, అందుకు సంబంధించి చర్చ జరగాల్సి ఉందని అన్నారు. యువతకు నాయకత్వం అప్పగించాలని, రాజకీయంగా ముందుకు వెళ్లాలని పవన్ అభిప్రాయపడ్డారు. బీసీ ఉద్యమానికి మద్దతుగా తనవంతుగా ప్రతి వేదికపైనా మాట్లాడతానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.