'మా'లో ఇక నరేశ్ హవానే నడుస్తుంది... ఇలాంటి పరిస్థితుల్లో మేం ఉండలేం: శ్రీకాంత్
- ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ప్రెస్ మీట్
- హాజరైన నటీనటులు
- నరేశ్ ఎంతో అనుభవజ్ఞుడన్న శ్రీకాంత్
- నరేశ్ ఉంటే కష్టమని అభిప్రాయం
- ఇదే అభిప్రాయం విష్ణుతో చెప్పామని వెల్లడి
ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ప్రెస్ మీట్ లో పాల్గొన్న నటుడు శ్రీకాంత్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. 'మా' ఎన్నికల్లో నరేశ్ అద్భుతంగా వ్యవహరించారని, పరిస్థితులు చూస్తుంటే ఇకపై 'మా' కొత్త కార్యవర్గాన్ని ఆయనే వెనకుండి నడిపిస్తారని అర్థమవుతోందని అన్నారు. గతంలో 'మా' అధ్యక్షుడిగా పనిచేసిన నరేశ్ ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా 'మా'లో ఆయన హవానే నడుస్తుందన్న అనుమానం కలిగిందని, ఇలాంటి పరిస్థితుల్లో తమ ప్యానెల్ సభ్యులు 'మా'లో కొనసాగితే రచ్చ తప్పదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు.
"మా లో నరేశ్ గారే ఉంటారన్న డౌట్ వచ్చింది. ఇలా ఉంటే సమస్యలు వస్తాయని మేం విష్ణుతో కూడా చెప్పాం. మేం పనిచేయాలంటే ఇలాంటి పరిణామాలతో కుదరని పని అని స్పష్టం చేశాం. అయితే విష్ణు చెప్పాల్సింది చెప్పారు. మా సినిమా బిడ్డల ప్యానెల్ లో ప్రశ్నించే ధైర్యం ఉన్నవాళ్లే ఉన్నారు. వారు ప్రశ్నిస్తుంటే వివాదాలు వస్తాయి. అందుకే మేం తప్పుకుంటున్నాం. మంచు విష్ణు తన మేనిఫెస్టో ప్రకారం మా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు" అంటూ వివరణ ఇచ్చారు.