ప్రపంచంలోనే బీసీసీఐ అత్యధిక ధనిక బోర్డు కాబట్టే ఈ పరిస్థితి: పాక్ ప్రధాని ఇమ్రాన్ వ్యాఖ్యలు
- డబ్బే క్రికెట్‌ను శాసిస్తోంది
- అందుకే ప్రపంచ క్రికెట్‌ను భారత్ శాసిస్తోంది
- క్రికెట్‌లోని డబ్బంతా భారత్‌లోనే ఉంది
- భారత్ ఏం చెబితే అదే ప్రపంచ క్రికెట్‌లో నడుస్తోంది
బీసీసీఐపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బే క్రికెట్‌ను శాసిస్తోందని ఆయన అన్నారు. ఆటగాళ్లనే కాకుండా క్రికెట్ బోర్డుల పరిస్థితి కూడా అలాగే ఉందని తెలిపారు. అన్నింటికంటే బీసీసీఐ ధనికవంతమైన బోర్డని, అందుకే ప్రపంచ క్రికెట్‌ను భారత్ శాసిస్తోందని చెప్పుకొచ్చారు.
క్రికెట్‌లోని డబ్బంతా భారత్‌లోనే ఉందని తెలిపారు. అందుకే, భారత్ ఏం చెబితే అదే ప్రపంచ క్రికెట్‌లో నడుస్తోందని, వాళ్లు చెప్పిందే చెల్లుతోందని వ్యాఖ్యానించారు. క్రికెట్‌లో భారత్‌ను కాదనే సాహసం ఎవరూ చేయబోరని ఆయన అన్నారు. పాకిస్థాన్ పర్యటనకు వెళ్లకుండా ఇంగ్లండ్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్‌పై ఇమ్రాన్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు.