తన బరువుకు సమానంగా.. 78 కిలోల బియ్యాన్ని శ్రీవారికి సమర్పించిన వైఎస్ జగన్
- శ్రీవారికి తులాభారం వద్ద మొక్కులు
- జగన్‌కు రంగనాయకుల మండపంలో పండితుల వేదాశీర్వచనం
- కొత్త బూందీపోటు, శ్రీవేంకటేశ్వర భక్తి హిందీ, కన్నడ చానెళ్ల ప్రారంభం
ఏపీ సీఎం జగన్ ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న కూడా ఆయన సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం ఆలయానికి చేరుకుని శ్రీవారికి తులాభారం వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. తన బరువుకు సమానంగా 78 కిలోల బియ్యం సమర్పించారు.
ఆ తర్వాత జగన్‌కు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. జగన్‌కు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమలలో కొత్త బూందీపోటు, శ్రీవేంకటేశ్వర భక్తి హిందీ, కన్నడ చానెళ్లను సీఎం ప్రారంభించారు. అన్నమయ్య భవన్‌లో టీటీడీ చేపట్టిన కొత్త కార్యక్రమాలను జగన్‌కు అధికారులు వివరించి చెప్పారు.