ఆటోడ్రైవర్లపై శివసేన కార్యకర్తల దాడి.. వీడియో వైరల్
- నిన్న మహారాష్ట్రలో బంద్
- నిర్వహించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్
- రోడ్లపై రెచ్చిపోయిన శివసేన కార్యకర్తలు
- థానేలో ఆటో డ్రైవర్లను కర్రలతో కొట్టిన కార్యకర్తలు
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో ఇటీవల రైతులపై చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు నిరసన తెలుపుతూ మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంలోని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నిన్న బంద్ కు పిలుపునివ్వడంతో శివసేన కార్యకర్తలు రోడ్లపై రెచ్చిపోతూ బంద్ ను విజయవంతం చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో థానే నగరంలో రోడ్లపై ఆటో డ్రైవర్లపై వారు దాడులు చేస్తుండగా తీసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఆటో డ్రైవర్లను శివసేన కార్యకర్తలు కర్రలతో కొట్టారు. ఓ నేత.. ఆటో డ్రైవర్ చెంపపై కూడా కొట్టారు. శివసేన కార్యకర్తలు ఆటోడ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో ఆటో డ్రైవర్లు భయాందోళనలకు గురయ్యారు. మరోవైపు, మహారాష్ట్రలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతబడ్డాయి.