నా రాజీనామా వెనుక లోతైన అర్థం ఉంది.. ‘మా’ ఎన్నికల్లో ఓటమిపై ప్రకాశ్ రాజ్
- త్వరలోనే కారణాలు చెబుతానని ట్వీట్
- నిరాశపరచబోనని కామెంట్
- తన టీం ఎంతో బాధ్యతగా ఉందని వెల్లడి
‘మా’ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. అసోసియేషన్ సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, తన రాజీనామా వెనుక ఓ లోతైన అర్థమే ఉందని ఆయన అన్నారు. దానిపై ట్వీట్ చేశారు.
‘‘మా వైపు నిలిచిన ‘మా’ సభ్యులందరికీ హాయ్.. నా రాజీనామా వెనుక చాలా లోతైన అర్థం ఉంది. అదేంటో త్వరలోనే మీ అందరికీ వివరిస్తాను. మాకు అందించిన ప్రేమాభిమానాల విషయంలో మన టీం ఎంతో బాధ్యతగా ఉంది. అలాంటి వారిని ఎప్పుడూ నిరాశపరచం’’ అని ట్వీట్ చేశారు.
కాగా, మా అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణుపై ప్రకాశ్ రాజ్ ఓడిపోయారు. విష్ణు ప్యానెల్ 10, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లో 8 మంది కార్యవర్గ సభ్యులుగా గెలిచారు. ఫలితాల తర్వాత నిన్న మీడియాతో మాట్లాడిన ఆయన.. జాతీయవాదం, ప్రాంతీయవాదం అనే కోణంలోనే ఎన్నికలు జరిగాయంటూ వ్యాఖ్యానించారు.