కేశినేని నాని వాహ‌నాన్ని నిలిపేసిన పోలీసులు.. నిర‌స‌న‌గా కాలిన‌డ‌క‌న వెళ్లిన ఎంపీ

  • విజ‌య‌వాడ‌లోని ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డు వ‌ద్ద ఘ‌ట‌న‌
  • కాలిన‌డ‌క‌న వెళ్లి అమ్మ‌వారికి పట్టు వస్త్రాల సమర్పణ‌
  • ప్రొటోకాల్ పాటించ‌డం లేద‌ని పోలీసుల తీరుపై ఆగ్ర‌హం 
విజ‌య‌వాడ‌లోని ఇంద్రకీలాద్రిపై అమ్మ‌వారిని ద‌ర్శించుకోవ‌డానికి వెళ్తున్న టీడీపీ ఎంపీ కేశినేని నాని వాహ‌నాన్ని ఘాట్‌రోడ్డులో పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త‌న కుటుంబ సభ్యులతో కలిసి కాలి నడకన‌ కొండపైకి వెళ్లారు. అనంత‌రం అమ్మ‌వారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజ‌ల్లో పాల్గొన్నారు.

తిరిగి వెళ్లేట‌ప్పుడు పోలీసులు ఆయ‌న‌ కారుకు అనుమతులు ఇచ్చిన‌ప్ప‌టికీ అధికారుల తీరుకు నిరసనగా కేశినేని నాని నడిచే వెళ్లడం గ‌మ‌నార్హం. ప్రొటోకాల్ పాటించ‌డం లేద‌ని పోలీసుల తీరుపై నాని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాగా, ఇంద్ర‌కీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అమ్మవారు సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.  


More Telugu News