ఇంత అలజడి మంచిది కాదు.. ‘మా’ ఎన్నిక ఏకగ్రీవమైతే బాగుండేది: రాఘవేంద్రరావు
- రాజకీయ రణరంగాన్ని తలపించిన ‘మా’ ఎన్నికలు
- ‘పెళ్లి సందD’ ప్రమోషన్‌లో భాగంగా విశాఖ వచ్చిన రాఘవేంద్రరావు
- అధ్యక్ష పదవిలో విష్ణు రాణిస్తాడని ఆశాభావం
రాజకీయ రణరంగాన్ని తలపించిన మా అసోసియేషన్ ఎన్నికలపై ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు స్పందించారు. ‘పెళ్లి సందD’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నిన్న విశాఖ వచ్చిన ఆయన మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల్లో ఇంత గందరగోళం జరగకుండా ఉండాల్సిందని అన్నారు.
ఇంత అలజడి సృష్టించడం తెలుగు చిత్రసీమకు అంతమంచిది కాదని అన్నారు. సినీ పెద్దలు అందరూ కలిసి అధ్యక్ష ఎన్నికలను ఏకగ్రీవం చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. నిజానికి అదే మంచి పద్ధతి కూడా అని పేర్కొన్నారు. అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికవడంపై మాట్లాడుతూ.. ఆ పదవిలో విష్ణు రాణిస్తాడన్న నమ్మకం ఉందని రాఘవేంద్రరావు అన్నారు.