సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- మరో స్పెషల్ సాంగులో అనసూయ
- 14న రజనీకాంత్ 'అన్నాత్తే' టీజర్
- నెట్ ఫ్లిక్స్ కి 'మహాసముద్రం' రైట్స్
* హాట్ యాంకర్ అనసూయ త్వరలో మరో స్పెషల్ సాంగులో నటించనున్నట్టు తెలుస్తోంది. రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉందనీ, ఇందులో అనసూయ నటిస్తుందని సమాచారం.
* సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'అన్నాత్తే' చిత్రానికి సంబంధించిన టీజర్ ను ఈ నెల 14న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఇక ఈ చిత్రాన్ని నవంబర్ 4న విడుదల చేస్తున్న విషయం విదితమే.
* శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన 'మహా సముద్రం' చిత్రం డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈ నెల 14న విడుదల చేస్తున్నారు. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.