ఎన్నికల నిబంధన ఉల్లంఘన.. ఈటల రాజేందర్‌పై కేసు నమోదు
- హుజూరాబాద్‌లో పెరుగుతున్న రాజకీయ వేడి
- కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి సభ నిర్వహించారంటూ ఆరోపణ
- ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదుతో ఎన్నికల నిబంధన ఉల్లంఘన కేసు
హుజూరాబాద్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వేడి రోజురోజుకు మరింత పెరుగుతోంది. ఇప్పటికే నేతల పరస్పర విమర్శలతో హుజూరాబాద్ రాజకీయం రంజుగా తయారుకాగా, తాజాగా బీజేపీ నేత, ఆ పార్టీ అభ్యర్థి అయిన ఈటల రాజేందర్‌పై కేసు నమోదైంది. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి మరీ సభ నిర్వహించారంటూ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆయనపై ఎన్నికల నిబంధన ఉల్లంఘన కేసు నమోదు చేశారు.
కాగా, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ వద్ద ఆటో, కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బాధిత బంధువులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నేతలు ఈటల రాజేందర్, వివేక్ వారికి సంఘీభావంగా రోడ్డుపై బైఠాయించారు.