జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఓటేయలేదో నాకు తెలుసు: మంచు విష్ణు
- కొందరు ఓటేయకపోవడంపై వివరణ
- కొందరు షూటింగుల్లో ఉన్నారని వెల్లడి
- కొందరు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యారని వ్యాఖ్య
- శ్రీకాంత్ తో ఎలాంటి విభేదాలు లేవన్న విష్ణు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటి అగ్రతారలు ఓటేయలేదని వెల్లడైంది. దీనిపై మంచు విష్ణు స్పందించారు. వారిలో కొందరు షూటింగుల్లో ఉన్నారని, కొందరు వ్యక్తిగత కారణాలతో ఓటింగ్ కు దూరంగా ఉన్నారని వివరించారు. అందుకు తానేమీ వారిని తప్పుబట్టడంలేదని, ఎందుకంటే సినిమానే తమకు అన్నం పెడుతోందని, షూటింగుల్లో పాల్గొనడాన్ని తాను స్వాగతిస్తానని తెలిపారు.
జూనియర్ ఎన్టీఆర్ గురించి చెబుతూ, తాను భారీ ఆధిక్యంతో గెలిచానంటూ మీడియాలో వచ్చిన వార్తలు చూసి తనకు మొట్టమొదట ఫోన్ చేసింది తారక్ అని వెల్లడించారు. "నా తమ్ముడు తారక్ మద్దతు నాకు ఎప్పుడూ ఉంటుంది. ఆ సంగతి నాకు తెలుసు. అయితే తారక్ ఎందుకు ఓటేయలేదో నాకు తెలుసు, అది పర్సనల్ విషయం. ఆ విషయాన్ని చెప్పను" అని అన్నారు.
ఇక మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన శ్రీకాంత్ తో తమకు ఎలాంటి విభేదాలు లేవని విష్ణు స్పష్టం చేశారు. తామంతా ఒకే కుటుంబం అని అన్నారు.