హుజూరాబాద్ ఉప ఎన్నిక: రాజేందర్ పేరుతో ఉన్న ముగ్గురి నామినేషన్ల తిరస్కరణ

  • హుజూరాబాద్ ఉప ఎన్నికకు ఇటీవల నామినేషన్లు
  • నేడు నామినేషన్ పత్రాల పరిశీలన
  • బరిలో 42 మంది అభ్యర్థులు
  • ఈ నెల 13 వరకు ఉపసంహరణకు అవకాశం
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈ నెల 30న జరగనుంది. ఈ నేపథ్యంలో ఇటీవల నామినేషన్లు సమర్పించగా, నేడు పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా 19 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వాటిలో రాజేందర్ పేరుతో ఉన్న ముగ్గురి నామినేషన్లు కూడా ఉన్నాయి. ఇప్పలపల్లి రాజేందర్, ఈసంపల్లి రాజేందర్, ఇమ్మడి రాజేందర్ అనే ఈ ముగ్గురు ఇతర జిల్లాలకు చెందినవారని తెలుస్తోంది.

ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో 42 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ నెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. కాగా, రాజేందర్ పేరుతో ఉన్న ఇతరులను తీసుకువచ్చి హుజూరాబాద్ లో నామినేషన్లు వేయించారని, ఓటర్లను గందరగోళానికి గురిచేసే కుట్ర అంటూ బీజేపీ ఆరోపిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో టీఆర్ఎస్ తరఫున గెల్లు శ్రీనివాస్, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్, కాంగ్రెస్ తరఫున వెంకట్ బల్మూరి పోటీలో ఉన్నారు.


More Telugu News