మోదీ, కేసీఆర్ లను బొందపెడితేనే అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో శాంతి ఉంటుంది: రేవంత్ రెడ్డి

  • ఇందిరాపార్క్ వద్ద మౌనదీక్ష 
  • హాజరైన రేవంత్ రెడ్డి
  • కేంద్రం, తెలంగాణ సర్కారుపై ఆగ్రహం
  • పాలకులే హంతకులంటూ విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. వారిద్దరినీ బొందపెడితేనే దేశంలోనూ, రాష్ట్రంలోనూ శాంతి ఉంటుందని అన్నారు. యూపీలో బీజేపీ నేతలు రైతులను కిరాతకంగా చంపేశారని మండిపడ్డారు. ఈ కేసులో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కొడుకు ఉంటే దీనిపై మోదీ, అమిత్ షా ఏం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

సిరిసిల్లలో కూడా దళితులను ఇసుక లారీలతో తొక్కించి చంపారని రేవంత్ రెడ్డి అన్నారు. పాలకులే హంతకులై, ప్రజలను భయాందోళనలకు గురిచేసి ప్రభుత్వాలను నడిపిస్తున్నారని విమర్శించారు. రైతులను చంపిన వారిని నడిబజారులో ఉరితీయాలని రేవంత్ డిమాండ్ చేశారు. యూపీలోని లఖింపూర్ ఖేరీలో జరిగిన దారుణం, కేటీఆర్ నియోజకవర్గంలో నేరేళ్ల వద్ద జరిగిన ఇసుక మాఫియా దురాగతం రెండూ ఒకటేనని స్పష్టం చేశారు.

రైతులను మోదీ, కేసీఆర్ మోసగిస్తున్నారని మండిపడ్డారు. గతంలో రైతు చట్టాలను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పిన కేసీఆర్ కు ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత చలిజ్వరం పట్టుకుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మౌనదీక్షలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు.


More Telugu News